5 July, 2026 | 7:01 PM

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

05-07-2026 06:09 PM

నరసన్నపల్లి సర్పంచ్ సహా 20 మంది చేరిక

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి మండలం నరసన్నపల్లి గ్రామ సర్పంచ్ రసమోల్ల రవి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు విశేషంగా ఆకర్షితులవుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని, అందుకే అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, గౌరవం లభిస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నరసన్నపల్లి సర్పంచ్ రాస మోల్ల రవి, చందన స్వామి, చందన చంద్రం, రస మొల్ల రాజయ్య, ధ్యాప చిన్న అంజయ్య, పిట్టల నర్సింలు, ఆలే రాజయ్య, రసమొల్ల స్వామి, ధ్యాప రవి లతోపాటు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.