5 July, 2026 | 7:02 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

05-07-2026 06:07 PM

హాస్టల్ లో మొక్కలు నాటిన కృష్ణమూర్తి

మంథని,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యతని పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని నీటి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని పర్యావరణ అవార్డు గ్రహీత గట్టు కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం గురుకుల విద్యార్థుల హాస్టల్ లో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణ కొరకు ఈ కార్యక్రమం నిరంతరంగా  నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పర్యావరణ ప్రేమికులు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగిగా కృష్ణమూర్తి మంథని పట్టణంలోని అనేక ప్రాంతాల్లో వెయ్యికి పైగా మొక్కలు నాకారని అలాగే నాటిన మొక్కల పర్యవేక్షణ కూడా చూస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొని ఆడారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికులు, విద్యార్థులు   పాల్గొన్నారు.