15 March, 2026 | 10:29 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

సెప్టెంబరు నుంచి సెట్స్ మీదికి

22-07-2024 02:33 AM

‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్‌చరణ్ పాత్ర చిత్రీకరణ పూర్తవడంతో ఆయన తర్వాత సినిమా పనులు వేగం పుంజుకుంటున్నాయి. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించనున్న ఈ సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు సానా రెండేళ్ళుగా కథ, కథనాలపై కసరత్తులు చేస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ స్వరకల్పనలో ఈ చిత్రం ప్రాణం పోసుకోనుండగా, ఇప్పటికే ఆయన మూడు పాటలను సిద్ధం చేసినట్టు సమాచారం. కాగా చిత్రీకరణకు కూడా ముహూ ర్తం ఖాయం చేశారట చిత్ర దర్శక నిర్మాతలు. ‘పెద్ది’ పేరు పరిశీలనలో ఉన్న ఈ సినిమా సెప్టెంబరులో సెట్స్ మీదికి వెళ్ళనుందిట. ప్రస్తుతం హీరో రామ్ చరణ్ ఆ పాత్ర కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆయన గుబురు గడ్డం, మీసాలతో కనపడనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ నెల 28 నుంచి ‘గేమ్ చేంజర్’ మూడు రోజుల పాటు జరు గనుందిట. తర్వాత కొంత విరామం తరవాత మరో 9 రోజుల చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.