ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా భరత్ భూషణ్
10-05-2026 12:00 AM
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పీ భరత్ భూషణ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చలనచిత్ర, టీవీ, నాటక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ సర్కార్ ఎఫ్‌డీసీ బాధ్యతలను భరత్ భూషణ్‌కు అప్పగించింది. 20 సంవత్సరాలుగా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వచ్చారు భరత్‌భూషణ్. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. ఇటీవలే ఆయన ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వైస్ ప్రెసి డెంట్‌గా ఎన్నికయ్యా రు. సినీ కార్మికుల సమస్యల పరిష్కారా నికి కృషి చేశారు.






