హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో టాలీవుడ్ సినిమా
హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో రూపుదిద్దుకోనున్న త మ కొత్త సినిమా.. తెలుగు మూవీ మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు డైరెక్టర్ బీఎస్ రావు. ‘ది మానిటి.ఇన్’ పేరుతో రూపొందించనున్న ఈ చిత్రం కాన్సె ప్ట్ పోస్టర్లను ఆయన శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో దర్శకుడు బీఎస్ రావు మూవీ కాన్సెప్ట్‌ను వివరించారు. “మానవత్వం విఫలమైన ప్పుడు ‘మానిటీ’ ఏం చేస్తుందనే విలక్షణమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుంది.
సమాజంలో మనిషి విలువలు తగ్గినప్పుడు ప్రకృతి లేదా ఒక అదృశ్య శక్తి ఏ విధంగా స్పందిస్తుందనే అంశాన్ని సైన్స్ ఫిక్షన్, సోషల్ ఎలిమెంట్స్ కలగలిపి కథ రాసుకున్నాం. ఐమాక్స్ ఫార్మాట్‌లో సినిమా చేయడానికి దర్శకుడు రాజమౌళి సైతం ఎంతో సమయం తీసుకున్నారు. నేను తొలి చిత్రంతోనే ఐమాక్స్8కే ప్రమాణాలను అందుకోవాలనుకుంటున్నా. మనిషి సంకల్పిస్తే సాధించలేనిది లేదని, తన టెక్నికల్ నాలేడ్జ్‌తో హాలీవుడ్ స్థాయి అవుట్‌పుట్‌ను టాలీవుడ్ హీరోలతో సాధ్యం చేసి చూపిస్తా.
ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించాం. ఎవరైనా ఈజీగా సెట్ అయ్యేలా కథను సిద్ధం చేశాను. ఏ హీరో ముందుకువచ్చినా, కలిసి చేయడానికి సిద్ధంగా ఉన్నా. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలో ప్రకటిస్తాం” అని తెలిపారు.






