2 April, 2026 | 3:18 AM

వేములవాడ రాజన్న దేవస్థానంలో నూతన డిప్యూటీ ఈఓగా భాస్కర్ బాధ్యతల స్వీకారం

02-04-2026 12:26 AM

వేములవాడ, ఏప్రిల్ 1,(విజయక్రాంతి)తెలంగాణలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నూతన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ)గా భాస్కర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం భాస్కర్ గా రు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ మండపం లో అర్చకులు, వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.