విభజన చట్టంలో హామీలను నెరవేర్చండి
కాంగ్రెస్ ఎంపీ రఘురాంరెడ్డి
బనకచర్లతో తెలంగాణకు అన్యాయం
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
ప్రజలను తప్పుదోవ పట్టించారు
కిషన్‌రెడ్డిపై ఎంపీ చామల మండిపాటు
హైదరాబాద్, ఏప్రిల్ 1(విజయక్రాంతి): భద్రాచలం నియోజకవర్గ పరిధిలో ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను తిరిగి వెనక్కి ఇచ్చేయాలని ఎంపీ రఘురాంరెడ్డి డిమండ్ చేశారు. బుధవారం లోక్‌సభలో అమరావతి చట్టబద్దత బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణకు కూడా నాడు కొన్ని హామీలు ఇచ్చార న్నారు. రాష్ట్రానికి ఎన్‌ఐటీ, ఐఐటీ వంటి విద్యా సంస్థలను కూడా ఇస్తామన్నారు. అలాగే హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
విభజ న సమయంలో తెలంగాణకు ఇచ్చిన చాలా హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. అదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయడంతో పాటు బయ్యారంలో స్టీల్ ప్లాంటును కూడా ఏర్పాటు చేస్తామని మా టిచ్చారన్నారు. ఏపీకి అదనపు నిధులు ఇవ్వడంపై తమకెలాంటి అభ్యంతరం లేదని, ఆ రాష్ట్రం తరహాలోనే తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాలని ఎంపీ రఘురాంరెడ్డి పేర్కొన్నారు. కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్రం సహకరించాలని కోరారు. మూసీ ప్రాజెక్టుకు, రీజినల్ రింగ్ రోడ్డు, కేటీపీఎస్ విస్తరణకు కూడా సహకరించాలని కోరారు.
ఎయిర్‌పోర్ట్ మంజూరు చేయాలి
ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్ట్‌తో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగు తోందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం లోక్‌సభలో మాట్లాడిన ఎంపీ తెలంగాణకు రావాల్సిన 200 టీఎంసీల నీళ్లు ఏపీ మళ్లిస్తుందని ఆరోపించారు. బనకచర్లతో వందలాది ఎకరాలు నీట మునుగుతాయన్నారు. అలాగే తెలంగాణకు రావాల్సిన బకాయిలను కేంద్రం వెంటనే చెల్లించాలని ఎంపీ కోరారు. అలాగే పెద్దపల్లి జిల్లాకు ఎయిర్ పోర్ట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో కిషన్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.




