గిర్మాపూర్ గుట్టల మల్లన్న జాతర ఉత్సవాలకు ఆహ్వానం
10-01-2026 04:13 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ ప్రాంతంలో గల గిర్మాపూర్ గుట్టల మల్లన్న జాతరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ కు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా గుట్టల మల్లన్న ఆలయ కమిటీ అధ్యక్షులు వంగేటి పద్మా రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ కమిటీ అభివృద్ధికి భాస్కర్ యాదవ్ తన వంతు కృషిగా రూ.21 వేలను విరాళం అందించడం జరిగిందని తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి ఉరాళం అందజేసిన జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ కు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి.సత్యం.మహేష్ తదితరులు పాల్గొన్నారు.




