దేవాలయ నిర్మాణానికి విరాళం అందజేత
10-01-2026 04:16 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ పెరుగిద్దా ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, గణపతి నాగేంద్ర స్వామి దేవాలయ నిర్మాణానికి మంచిర్యాల జిల్లా వాస్తవ్యులు అశోక్ కుమార్ లడ్డ (సలాసార్ రైస్ మిల్) వారు రూ.15,000 విరాళంగా అందించారు. వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉంటాయని పూజారి కొండపలకల అభిలాష్ స్వామి తెలిపారు. అశోక్ కుమార్ లడ్డా ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఆలయ డైరెక్టర్, సామాజిక సేవకులు కత్తర్ల పోచమల్లు ఉన్నారు.






