సిపిఐ బహిరంగ సభను విజయవంతం చేయాలి
సిపిఐ మండల కార్యదర్శి తొట్ల ప్రభాకర్
నూతనకల్,(విజయక్రాంతి): సిపిఐ శత వసంతాల ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి తొట్ల ప్రభాకర్ గౌడ్ కోరారు.శనివారం మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 'బహిరంగ సభ' కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో ఆవిర్భవించిన సిపిఐ, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉందన్నారు.
శతవసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 18న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సభకు సిపిఐ జాతీయ స్థాయి నాయకులతో పాటు కమ్యూనిస్టు దేశాల ప్రతినిధులు, వామపక్ష నాయకులు పాల్గొంటున్నారని.. కావున మేధావులు, యువతీ యువకులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, నరేష్, వెంకట్ గిరి, పద్మ, చైతన్య, మల్సూరు తదితరులు పాల్గొన్నారు.






