ట్రెజరీకి టాటా!

11-09-2026 | 05:30am

పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

  1. పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ
  2. సొంత ఆదాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి.. 
  3. ట్రెజరీకి పంపే విధానానికి స్వస్తి 
  4. నిధుల వినియోగంలో జాప్యానికి చెక్ 
  5. గ్రామీణ సంస్థల బలోపేతమే లక్ష్యం 
  6. పంచాయతీలకు ప్రతినెలా రూ.50 కోట్లు: మంత్రి సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్  10 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీలకు(Village Panchayats) ఆర్థిక స్వేచ్ఛ దక్కనుంది. ఇకపై పంచాయతీల సొంత ఆదాయం ట్రెజరీ(Treasury)లో కాకుండా నేరుగా వాటి బ్యాంకు ఖాతా(Bank account)ల్లో జమకానుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం(Panchayat Raj Act) -2018కి సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ శాఖ సీతక్క(Panchayat Raj Department Seethakka) బుధవారం సభలో బిల్లును ప్రవేశపెట్టగా.. గురువారం చర్చ అనంతరం సభ్యులు ఆమోదించారు. ఇప్పటివరకు పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీలో జమ చేసి, అవసరమైనప్పుడు తిరిగి తీసుకునే విధానం అమ ల్లో ఉంది.

తాజా సవరణతో నిధుల వినియోగంలో జాప్యం తగ్గి, గ్రామాల్లో అత్య వసర పనులకు సొంత ఆదాయాన్ని వేగం గా వినియోగించుకునే అవకాశం ఏర్పడనుంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రెండేళ్లుగా 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయానని, ఇప్పుడిప్పుడే విడుదల అవుతున్నాయన్నారు. కేంద్రం నుంచి దాదాపు రూ. 619 కోట్లు రావాల్సి ఉందన్నారు.

2018 నుంచి స్టాంపు డ్యూటీని తొలగించడం వల్ల స్థానిక సంస్థలు కొంత సంక్షోభంలో కూరుకుపోయాయని, సమస్యను అధిగమించేందుకు పంచాయతీలకు ప్రతి నెలా రూ.50 కోట్లు విడుదల చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఎంపీ, ఎమ్మెల్యేల నిధుల నుంచి అభి వృద్ధి పనులు చేసిన సర్పంచ్‌లు..  పంచాయతీరాజ్ శాఖను అడుగుతున్నారని, ఎటువం టి బకాయిలు లేవని మంత్రి స్పష్టం చేశారు. 

స్థానిక వనరులు.. గ్రామాభివృద్ధికే..

పంచాయతీలకు స్థానిక వనరుల ద్వారా సమకూరే ఆదాయం గ్రామావృద్ధికే ఉపయోగపడాలన్నది ప్రభుత్వ విధానమని మంత్రి సీతక్క తెలిపారు. పంచాయతీలు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే సంస్థలుగా కాకుండా.. స్వయంపాలనా సంస్థలుగా పని చేయాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా వం టి అనేక బాధ్యతలు పంచాయతీలకు ఉన్నాయన్నారు. అయితే సొంత ఆదాయ వనరులున్న ప్పటికీ చిన్న పనులకు కూడా ఆ డబ్బును సమయానికి వినియోగించుకోలేని పరిస్థితి ఉంద న్నారు.

వివిధ నిబంధనల కారణంగా నిధులు డ్రా చేయటంలో జాప్యం ఏర్పడుతుందని, త ద్వారా అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరిగి ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక నుంచి అలాంటి సమస్య ఉండ దని, పంచాయతీ సొంత ఆదాయం వాటి బ్యాంకు ఖాతా ల్లో జమ కానుందని, అందు కు అనుగుణంగా  పంచాయతీ చట్టాన్ని సవరించినట్లు వెల్లడించారు. పంచాయ తీలను గత బీఆర్‌ఎస్ ప్ర భుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.   

కేంద్ర ప్రభుత్వ విధానాలతో అభివృద్ధికి విఘాతం 

కేంద్రం నూతన విధానాల కారణంగా గ్రా మాల అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని సీతక్క తెలిపారు. వీజీబీ రాంజీతో రాష్ట్రాలపై రూ.2 వేల కోట్ల అదనపు భారం పడుతుందని, అయినా పెద్దఎత్తున పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఇం టింటికీ ఇంకుడు గుంత, పొలానికి పంట కుంట, ఊరికి ఊటకుంటలను నిర్మి స్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి పక్కా రహదారి ఉం డాలని సీఎం పెద్ద ఎత్తున నిధులు మం జూరు చేస్తున్నారని,  మండల కేంద్రానికి డ బుల్ రోడ్డు ఇస్తున్నామని, హ్యామ్ విధానాం లో వేల కీలో మీటర్ల మేర రహదారులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

అటవీ ప్రాంతాలో రోడ్ల నిర్మాణానికి అడ్డంకులు ఎదురువుతున్నాయని, కేంద్రం నుంచి క్లియరెన్స్ ఇప్పించాలని బీజేపీ నేతలకు సూచించారు. ఉప సర్పంచ్‌ల చెక్‌పవర్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. అంతకుముందు సభ్యులు భూపతిరెడ్డి, పాల్వాయి హరీ ష్, విజయరమణరావు, మాజీద్ హుస్సేన్, పాయల్ శంకర్, చిక్కుడు వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, రామ్మోహన్‌రెడ్డి పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై మా ట్లాడారు. పంచాయతీల అభివృద్ధిలో నిధుల ప్రీజింగ్ ఆటంకంగా మారిందని, సమస్యను నివారిం చాలని సభ దృష్టికి తీసుకెళ్లారు.  

పొలాలకు దారులు వేయండి : బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ 

రైతులు తమ వ్యవసాయ బావులు, పొ లాల వద్దకు వెళ్లడానికి దారులు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రభుత్వా న్ని కోరారు. కేంద్రం నుంచి వచ్చే వీబీరాంజీ నిధుల నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. తన రాజకీయ ప్రస్థానం సర్పంచ్ నుంచే మొదలైం దని, సర్పంచ్‌లు ఇబ్బందులు ఏంటో తనకు తెలుసన్నారు.

పంచాయతీల అధికారాలపై గొప్పగా చర్చ జరిగినా.. అమలులో మాత్రం సాధ్యం కావడం లేదని, పరిమిత పవర్స్‌తో సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ చెక్ పాస్ కావాలంటే అధికారుల ఆదేశాలు ఉండాలని, కుబేరు సాఫ్ట్‌వే ర్‌ను ఎందుకు తెచ్చా రో? తెలియడం లేదన్నారు. పంచాయతీల ఆదాయం ట్రెజరీలో కాకుండా నేరుగా బ్యాంకుల్లో జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు.

మరిన్ని వార్తలు