14 August, 2026 | 4:01 PM

అంబులెన్స్‌లోనే పురుడు పోసిన 108 సిబ్బంది

14-08-2026 02:49 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వాంకిడి మండలం ఇందాని గ్రామానికి చెందిన సేండే స్వరూపకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. దీంతో ఆమెను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్‌ను పక్కకు నిలిపారు.వెంటనే స్పందించిన ఈఎంటీ ప్రవీణ్ యాదవ్ అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం చేయించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.38 గంటలకు స్వరూప రెండో కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఈఎంటీ ప్రవీణ్ యాదవ్, పైలట్ రమేష్ తెలిపారు. సకాలంలో స్పందించి సురక్షిత ప్రసవం చేసిన సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.