14 August, 2026 | 4:16 PM

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్యలు

14-08-2026 02:45 PM

బోధన్,(విజయక్రాంతి): ఇసుక అక్రమ తరలించే డోజర్ ‌ను శుక్రవారం పట్టుకున్న సాలూర ఆర్ఐ శంకర్ పట్టుకున్నారు అనంతరం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. తగ్గేల్లీ వద్ద ఇసుక సమృద్ధిగా ఉన్న మంజీరా వాగు నుంచి అక్రమంగా ఇసుకను తవ్వుతున్న డోజర్‌ను పోలీసులు పట్టుకున్నారు. తగ్గేల్లీ గ్రామంలోని మంజీరా వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

అదేవిధంగా మందన్న గ్రామంలోని మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్, రెండు టాటా ఏస్ వాహనాలను పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మంజీరా నది, వాగుల నుంచి ఇసుకను తరలించడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.