calender_icon.png 5 June, 2025 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో పుట్టినరోజు వేడుకలు నిషేధం

03-06-2025 07:39:21 PM

కోదాడ పట్టణ సీఐ శివశంకర్ హెచ్చరిక..

కోదాడ: రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత ఉత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని కోదాడ పట్టణ సీఐ శివశంకర్(Town CI Sivashankar) యువకులకు ఉద్బోధించారు. సోమవారం రాత్రి కోదాడలోని ఓ దాబాలో మిత్రుని పుట్టిన రోజు సందర్భంగా కొందరు యువకులు వేడుక నిర్వహించారు. దాబా బయటకు వచ్చి రోడ్డుపై విచ్చలవిడిగా చిందులేస్తూ అల్లరి చేస్తున్న కొందరు యువకులకు ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. పుట్టిన రోజు వేడుకను ఇంట్లో అమ్మనాన్నలు, తోబుట్టువులతో ఆనందంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన యువకులను హెచ్చరించారు.