సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్..
కూకట్ పల్లి (విజయక్రాంతి): అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్(Allwyn Colony Division Corporator Dodla Venkatesh Goud) అన్నారు. పీజేఆర్ నగర్ కాలనీలో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన కాలనీ వాసులతో కలసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ... వర్షాకాలంలో వర్షపు నీరు ఇండ్లలోకి చేరకుండా సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు విషయంలో రాజీపడకుండా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, మారెళ్ళ శ్రీనివాస్, రవి, షౌకత్ అలీమ్ మున్నా, ముజీబ్, సంగమేష్ తదితరులు ఉన్నారు.






