9 April, 2026 | 3:10 AM

బీజేపీ,బీఆర్‌ఎస్‌లు చెత్తతో చెత్త రాజకీయాలు

09-04-2026 01:15 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు

ముకరంపుర, ఏప్రిల్ 8(విజయ క్రాంతి): కరీంనగర్ లో డంపు యార్డు విషయంలో బిజెపి, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు చెత్తతో చెత్త రాజకీయాలు చేస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో స్మార్ట్ సిటీ నిధులలో కోట్ల రూపాయలు కొల్లగొట్టి అవినీతి పాలన చేశారని మండిపడ్డారు. కరీంనగర్ లో గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకు పోవడానికి ప్రధాన కారణం గత బిఆర్‌ఎస్ పార్టీ అసమర్థ పాలన కాదా అని ప్రశ్నించారు.

గత ఏడాది కేంద్ర పురపాలక శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో హడావిడి చేసి డంపు యార్డ్ సమస్యకు పరిష్కారం చూపుతామన్న బండి సంజయ్ కుమార్ ఇప్పుడు డంపు యార్డు విషయంలో రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్లో ఒకటి హుజురాబాద్ లో మరొక టి మాట్లాడుతూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రా ష్ట్ర ప్రభుత్వం వాటాను దాచి కరీంనగర్ ను కేంద్రమే అభివృద్ధి చేస్తుందని అబద్ధాలు చె ప్పారని, ఇప్పటికైనా ప్రజలకు భ్రమలు క ల్పించడం మానుకోవాలని అన్నారు.

హుజురాబాద్ లో బీఆర్‌ఎస్, బిజెపి నేతలు దీక్షల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, విమర్శించారు. కరీంనగర్ లోని డంప్ యా ర్డు లో చెత్తను పూర్తిగా తొలగించి వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి ఎటువంటి నిల్వ లేకుండా చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. చెత్త నిల్వ లేనప్పుడు అది సిర్సపల్లి లో ఏర్పాటు చేసిన ఎక్కడ ఏర్పాటు చేసినా ప్రజలకు ఎ టువంటి ఇబ్బందులు కలుగవని పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో తాజొద్దీ న్, పిట్టల రవీందర్,కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి,వరాల నర్సింగం,పర్వతం మల్లే శం, సరిల్ల ప్రసాద్,ఇక్రమ్ సిఖిందర్,కొట్టె ప్ర భాకర్,ఖలీల్,దేవేందర్ పటేల్,హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.