9 April, 2026 | 4:24 AM

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. బైకుపై వెళ్తున్న ముగ్గురు మృతి

09-04-2026 01:16 AM

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు వద్ద ఘటన

బిచ్కుంద,  ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలోని మేనూరు గ్రామ శివారు ఫరిదిలోనీ161 జాతీయ రహదారిపై ఆగి ఉన్న రాజస్తాన్ లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి  చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు మృతులు మద్నూర్ లో కూలీ పనులు చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన నాగు (48), అదే గ్రామానికి చెందిన సచిన్ (17), జుక్కల్ మండలం నాగాల్గావ్ గ్రామానికి చెందిన అశోక్(21) గా గుర్తించారు.

ఈ ఘోర ప్రమాదంతో మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. అంతేకాకుండా కుటుంబానికి జీవనాధారమైనటువంటి పెద్దవారు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు చిత్రమై జీవనాధార పరిస్థితులు వీధిన పడ్డాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేేసి దర్యాప్తు చేస్తున్నారు.