19 June, 2026 | 5:22 PM

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

19-06-2026 03:57 PM

ప్రభుత్వ విప్ విజయరమణ రావు సమక్షంలో కీలక నాయకుల చేరిక

పెద్దపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా పాలనకు ఆకర్షితులై పెద్దపల్లి నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే  చింతకుంట విజయరమణ రావు సమక్షంలో శుక్రవారం జూలపల్లి మండలం, కొనరావుపేట గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

పార్టీలో చేరిన ప్రముఖులు

ఈ కార్యక్రమంలో జూలపల్లి మండల బీజేపీ మాజీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కసుకుంట్ల రవీందర్ రెడ్డి, నల్ల రాం రెడ్డి, వార్డు మెంబర్లు ఆవుల సంతోష్, దాడి గట్టు, మల్లరాపు రవీందర్, మల్లారపు సాయి కిషోర్ మరియు రాజారాం రెడ్డి, కాసుకుంట్ల జైపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులతో పాటు సుమారు 70 మందికి పైగా వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే విజయరమణ రావు  పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అభివృద్ధికి ఆకర్షితులయ్యాం

ఈ సందర్భంగా కసుకుంట్ల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, రైతు రుణమాఫీ నుండి సన్నబియ్యం పంపిణీ వరకు ప్రజారంజకమైన పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కొనియాడారు. కేవలం రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఎమ్మెల్యే విజయరమణ రావు గారు పెద్దపల్లి నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు, ఆయన చేస్తున్న కృషికి ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం అవుతామని వారు పేర్కొన్నారు.