19 June, 2026 | 6:25 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడు బాధ్యత

19-06-2026 05:11 PM

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పచ్చదనం పెంపుకు సహకరించాలని ప్రజలకు ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. శుక్రవారం వనమహోత్సవం సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పచ్చదనం పెంపునకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వ ఆయన మొక్కలు నాటారు. అనంతరం పట్టణంలో పారిశుద్ధ్య సౌకర్యాల అభివృద్ధి కోసం రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన అస్పిరేషనల్ టాయిలెట్‌కు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పచ్చదనం పెంపుకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృత స్థాయిలో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు.

మొక్కల నాటకం అనంతరం రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న అస్పిరేషనల్ టాయిలెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, పారిశుద్ధ్యం, పచ్చదనం పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. చిట్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.