19 June, 2026 | 6:41 PM

అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

19-06-2026 05:18 PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు ​​

హైదరాబాద్: డిసెంబర్ 2024లో చిక్కడపల్లిలోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట(Sandhya Theatre stampede case) ఘటనకు సంబంధించి, ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) సోమవారం నాడు స్వయంగా కోర్టుకు హాజరుకావాలని నాంపల్లిలోని స్థానిక కోర్టు సమన్లు ​​జారీ చేసింది. ఈ కేసులో అర్జున్ A11గా ఉన్నారు. 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.

ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి 'పుష్ప-2' ప్రీమియర్ షో('Pushpa 2' Premiere Show) చూసేందుకు సంధ్య థియేటర్‌కు వెళ్లింది. 2025 జనవరి 5న, అదే కేసులో అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరయ్యారు. తనకు మంజూరైన బెయిల్‌లో భాగంగా, అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఈ కేసులో 19 మంది నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. 23 మందిపై ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.