19 June, 2026 | 6:21 PM

మృతి చెందిన మావోయిస్టు పొలాలలో తవ్వకాలు

19-06-2026 05:13 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని పో చ్చర జలపాతం సమీపంలో ఉన్న మృతి చెందిన పొలాలలో పొలాలలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరపడంతో సంచలనంగా మారింది. అర్ధరాత్రి పూట గత కొన్ని రోజుల నుండి తవ్వకాలు జరుగుతుండడంతో తవ్వకాల వెనుక ఏమిటనేది అంతు పట్టడం లేదు. మావోయిస్టు మైలారపు అడెల్లు ఎన్కౌంటర్లో ఏడాది క్రితం మృతి చెందాడు. అయితే ఆయన బ్రతికి ఉన్న సమయంలో ఆయన పొలంలో ఏమైనా దాచి ఉంచాడా అన్న ఆలోచనలతో తవ్వకాలు జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.

తవ్వకాలు జరిపేందుకు వస్తున్న వారు స్థానికులు కాకపోగా వారిలో ఓ మహిళ ఉందని పలువురు పేర్కొంటున్నారు. తవ్వకాలు జరుగుతున్నది గుప్తనిధులకు లేక ఆయన బ్రతికి ఉన్న సమయంలో పొలంలో ఏమైనా ఆయుధాలుగాని డబ్బులు గానీ ఉంచా డన్న అనుమానంతో జరుపుతున్నారని అనుమానిస్తున్నారు. అయితే తవ్వకాలు జరిపినచోట పూజ సామాగ్రి ఉండడం వల్ల గుప్తనిధుల కోసమే తవ్వకాలు చేస్తున్నారేమోనని పలువురు అంటున్నారు. ఏది ఏమైనా మృతి చెందిన మావోయిస్టు చేనులో తవ్వకాలు సంచలనంగా మారింది