30 March, 2026 | 7:59 PM

తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు

16-05-2024 01:35 AM

కిషన్‌రెడ్డివి పగటి కలలు 

పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కై లోపాయికారి ఒప్పందాలతో చీకటి రాజకీయాలు చేశాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేకపోయారని, ప్రజలు తమ వైపే నిలిచారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పగటి కలలు కంటున్నారని చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లలో విజయం సాధిస్తుందని, కేంద్రంలో నూ ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని తెలిపారు. రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కిషన్‌రెడ్డి అభినవ గోబెల్స్‌గా మారిపోయారని, అబద్ధాలు చెప్పడంలో గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కుతారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌పై బీజేపీ ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు.