ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
16-05-2024 01:34 AM
పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 బస్సులు
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): ఐపీఎల్ అభిమానుల కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ తెలిపింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. గురువారం ఉదయం 6 నుంచి రాత్రి 11.30 గంటల మధ్య వీటిని నడపనున్నది.




