ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

17-09-2026 | 12:04pm

ముకరంపుర, సెప్టెంబర్ 17(విజయ క్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ మేయర్(Deputy Mayor) క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాల వల్లే ఈ రోజు మనకిది సాధ్యమైందన్నారు. 

వారి పోరాట పటిమను, ప్రాణత్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని అన్నారు.తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు తెలంగాణ నేల కోసం ప్రాణాలు అర్పించిన అమరులందరికీ హృదయపూర్వక నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కాలనీ వాసులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




మరిన్ని వార్తలు