ముట్టడికి ముందే అరెస్టులు

12-09-2026 | 05:19pm

బీజేపీ నేతలపై పోలీసుల ఉక్కుపాదం!

రామాయంపేట,(విజయక్రాంతి): బీజేపీ చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో రామాయంపేట(Ramayampet)లో పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరలేపారు. ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సిద్ధమైన బీజేపీ నాయకులను(BJP leaders) కార్యక్రమానికి ముందే అదుపులోకి తీసుకోవడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందస్తు అరెస్టైన వారిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శీలం అవినాష్ రెడ్డి(BJP president Seelam Avinash Reddy), ప్రధాన కార్యదర్శి అక్కల అనిల్, సంతోష్, బీజేవైఎం నాయకులు నాగరాజు దువ్వెనపల్లి, సందీప్తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచలేరని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు