మొక్కలు నాటిన బీజేపీ నాయకులు
05-06-2026 08:04 PM
చిట్యాల,(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్యాల పట్టణంలో బిజెపి నాయకులు శుక్రవారం మొక్కలు నాటారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో గల పాటిమీద ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద బిజెపి నాయకులు మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.






