18 March, 2026 | 10:30 PM

కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం

07-11-2024 11:48 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన గురువారం పార్టీ కీలక సమావేశం జరుగుతోంది. జిల్లా అధ్యక్షులు, సంస్థాగత జిల్లా రిటర్నింగ్ అధికారులతో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జన్సల్, బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీల నియామకంపై దిశానిర్దేశం చేయనున్నారు.ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా చర్య జరుగనుంది.  ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సమావేశం జరుగనున్నట్లు సమాచారం.