9 July, 2026 | 5:09 PM

జాతీయ పునర్ పునర్నిర్మాణం లక్ష్యం

09-07-2026 04:17 PM

 నిర్మల్ జులై 9 (విజయక్రాంతి): దేశంలో జాతీయ పునర్నిర్మాణ లక్ష్యంలో ఏబీవీపీ ముందుండి పోరాడుతుందని జాతీయ కార్యవర్గ సభ్యుడు బి లక్ష్మణ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద ఆశయాల సాధనలో భాగంగా దేశంలో జాతీయత దేశ భద్రత రక్షణ విద్యారంగ సమస్యలు తదితర అంశాలపై ఏబీవీపీ అనేక పోరాటాలు చేసిందని తెలిపారు. నేటి యువత దేశం కోసం ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దినేష్ వంశీ కార్తీక్ అభి మనీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.