9 July, 2026 | 5:01 PM

డీఈవో ను కలిసిన టీఎన్జీవో ప్రతినిధులు

09-07-2026 04:22 PM

ముకరంపుర, జూలై 9(విజయక్రాంతి): గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో నరేడ్ల ప్రశాంత్ రెడ్డిని టీఎన్జీవో ల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించడంతో, డీఈవో ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం టీఎన్జీవో ల సంఘం నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.