బీజేపీ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బీఆర్‌ఎస్‌లో చేరిక
09-03-2026 05:24 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరి జయరాజ్ సోమవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆయనకి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. అందరం కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్, పార్టీ సీనియర్ నాయకులు నిసార్, దూడల అశోక్, కాసిం, బూసి భీమేష్ తదితరులు పాల్గొన్నారు.




