5 September, 2026 | 12:42 PM

ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా

05-09-2026 | 10:36am

హైదరాబాద్: తెలంగాణ రైతు సమస్యలపై భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) పోరుబాట పట్టింది. నిషేధిత భూసమస్యలపై టీబీజేపీ నేతలు(Telangana BJP leaders) గళమెత్తనున్నారు. ఇందిరా పార్క్(Indira Park) వద్ద బీజేఎల్పీ ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతోంది. 22ఏ, భూభారతి పేరుతో ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ధర్నాకు పిలుపునిచ్చారు.బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(BJLP Leader Eleti Maheshwar Reddy) నేతృత్వంలో ధర్నా కొనసాగుతోంది. మహాధర్నాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy), రామచందర్ రావు, లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలుచ ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. మీ భూములను 22-A నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రభుత్వ మెడలు వంచేందుకు బీజేపీ చేపడుతున్న దీక్షకు పెద్దఎత్తున తరలిరావాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etela Rajender) ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు