7 March, 2026 | 5:02 PM

వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్

07-03-2026 03:21 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు దాసోహం వెంకటేశ్వర్లు తల్లి దాసోహం సరోజన ఇటీవల అనారోగ్యంతో మరణించగా శనివారం వారి కుటుంబ సభ్యులను బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరబెల్లి  రఘునాథ్ పరామర్శించి, చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు, ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మీడియా కన్వీనర్ పల్లి రాకేష్, దాసోహం శ్రీనివాస్, దాసోహం అనిల్,దాసోహం సంతోష్  తదితరులు పాల్గొన్నారు.