తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం
వాంకిడిలో ఏడాది అయినా తెరుచుకోని ఆయుష్ ఆరోగ్య స్వస్థత కేంద్రం
వాంకిడి,(విజయకాంతి): గ్రామాల్లో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయని గొప్పగా చెప్పుకుంటూ నిర్మించిన యోగ సాధన కేంద్రం వాంకిడిలో మాత్రం తాళాలకే పరిమితమైంది. స్థానిక వాంకిడి మండల కేంద్రంలోని ఉన్నత శ్రేణి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ‘ఆరోగ్య స్వస్థత కేంద్రం’ పేరుతో ఏర్పాటు చేసిన యోగ కేంద్రం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది.
గ్రామీణ ప్రజలకు యోగ ద్వారా ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని నిర్మించేందుకు సుమారు రూ.4.5 లక్షల ప్రభుత్వ నిధులు ఖర్చు చేశారు. నిబంధనల ప్రకారం ఉదయం పురుషులకు నెలకు 28 రోజులు, సాయంత్రం మహిళలకు నెలకు 22 రోజులు యోగ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం పురుష శిక్షకులకు నెలకు రూ.8 వేలు, మహిళా శిక్షకులకు రూ.5 వేల పారితోషికం చెల్లించేందుకు కూడా మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.
శిక్షకులు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రజలకు సరైన సమాచారం లేకపోవ డం, అధికారులు పట్టించు కోకపోవడంతో యోగ సాధ నకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా కేంద్రం వెలవెలబోతుండగా, ప్రభుత్వ లక్ష్యం నీరుగారు తోంది.యోగ కేంద్రం నిర్మించి ఏడాది దాటుతున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రారం భించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘భవనాలు కడితే సరిపోదు.. ప్రజలకు ఉపయో గపడేలా నడపాలి’’ అంటూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండ గడుతున్నా రు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి, గ్రామస్థులకు అవగాహన కల్పించి యోగ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.




