10 June, 2026 | 4:55 PM

మీనాక్షి నటరాజన్ వివాదంపై స్పందించిన బీఎల్ సంతోష్

10-06-2026 04:23 PM

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య వార్ నడుస్తోంది. బీజేపీ, ఎలక్షన్ కమిషన్ పై కాంగ్రెస్ విమర్శిస్తుంటే బీజేపీ మాత్రం వాస్తవాలను దాచిపెట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు నామినేషన్ దాఖలు చేసిందంటూ విపక్ష నాయకులు విరుచుపడుతున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ స్పందించారు. ఆమె కేసు గురించి లీక్ చేసిన కాంగ్రెస్ కోవర్ట్ ఎవరో చెప్పాలని, కాంగ్రెస్ కోవర్ట్ ను పట్టుకోకుండా బీజేపీ మీద అరుపులు ఎందుకు..? ప్రశ్నించారు. ముందు కాంగ్రెస్ లోని కోవర్ట్ లను పట్టుకుని అదుపులో పెట్టుకోండని సూచించారు.