కాల్వలను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు
- గుండ్లవాగులో అక్రమ నిర్మాణాల కూల్చివేత
- మొయినాబాద్ తహసీల్దార్ కె.గౌతమ్ కుమార్
- తోల్కట్టాలో నాలాల కబ్జా... కథనానికి స్పందన
చేవెళ్ళ/మొయినాబాద్ 10 (విజయక్రాం తి): తొల్కట్ట గ్రామ శివారులోని సర్వే నెంబర్లు 159,162,163,175,177 లో నుండి ప్రవహించే గుండ్లవాగులో సర్వే నెం 162 లో కొందరు వ్యక్తులు మట్టిపూడ్చి పెద్ద ఎత్తున కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్న విషయంలో తహసీల్దార్ కె. గౌతమ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బుధవారం మండల సర్వేయర్, ఇరిగేషన్ అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు.
అనంతరం వాగులో నిర్మించిన సుమారు 300 మీటర్ల అక్రమ రాతి కట్టాడాన్ని (కాంపౌండ్ వాల్ )ను రెండు జేసీబీ ల సహాయంతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్బంగా తహసీల్దార్ కె. గౌతమ్ కుమార్ మాట్లాడుతూ... వాగు కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
111 జీవో పరిధిలోని చెరువులు/ వాగులు/కాల్వల జోలికిస్తే చట్టపరమైన కేసులు బుక్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో మండల సర్వేయర్ జలజ, ఇరిగేషన్ ఏఈలు శివకుమార్,వరప్రసాద్, తొల్కట్ట జీపీఓ గణేష్ తో పాటు రెవెన్యూ సిబ్బంది జీపీఓలు జానకిరామ్,రవి, నర్సింహా, అజిజ్, రామకృష్ణ,రాజు,అమర్ తదితరులు పాల్గొన్నారు.






