9 April, 2026 | 5:01 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

బ్లాక్‌మెయిల్ టీచర్ మాకొద్దు

16-04-2025 12:00 AM
  1. స్నానం చేస్తుండగా వీడియోలు తీసి
  2. తాను చెప్పినట్టే వినాలని బెదిరిస్తోంది
  3. కేజీబీవీ లోని ఇంగ్లీష్ టీచర్ వేధింపులపై విద్యార్థుల ఆందోళన

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 15 ( విజయక్రాంతి ): తాను చెప్పినట్టు వినకుంటే స్నానం గదుల్లో తీసిన ఫోటోలు, వీడియోలతో తరచూ బెదిరిస్తున్న టార్చర్ టీచర్ పై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంగళవారం మరోసారి చోటుచేసుకుంది.

ఈనెల 6న స్టడీ అవర్స్ కు లేటుగా వచ్చిందన్న సాకుతో 9వ తరగతి చదువుతున్న యామిని అనే విద్యార్థిని ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి మంచినీరు తాగనివ్వకుండా వాష్ రూమ్ కూడా వెళ్ళనివ్వకుండా టార్చర్ చేసిన ఘటనలో మనస్థాపమ్ చెందిన విద్యార్థిని చాకుతో చేతిని కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పా ల్పడింది.

ఈ ఘటనలో సదరు టీచర్ పై  అధికారులు చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ మంగళవారం పాఠశాల విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం చేయకుండా ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ భాస్కర్ రెడ్డి పాఠశాలలకు చేరుకొని విద్యార్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశా రు. ఆయనా వినకపోవడంతో డీఈఓ రమే ష్ కుమార్ వారిని సముదాయించారు.

సద రు టార్చర్ టీచర్ పై చర్యలకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కు నివేదించామని వరుసగా సెలవుల నేపథ్యంలో చర్యలకు ఆలస్యం జరిగిందన్నారు. మరో 15 రోజుల్లో శాఖ పరమైన చర్యలు ఉంటాయని హామీ ఇవ్వడం తో నిరసన విరమించారు.

ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి తన ఫ్రస్టేషన్తో విద్యార్థులను చిన్నచిన్న కారణాలతోనే తీవ్ర పరుష పదజాలం తో దూషిస్తూ చెంపదెబ్బలు, గోడ కుర్చీలు వంటివి వేస్తూ టార్చర్ చేస్తుందని ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

బట్టలు మార్చుకుంటుండగా, స్నా నం చేస్తుండగా ఫోటోలు వీడియోలు తీసి ఎవరికో పంపుతోందని విద్యార్థులు ఆరోపించారు. అయినా తనపై చర్యలు తీసుకు నేందుకు అధికారులు ఎందుకు జంకుతున్నారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.