15 May, 2026 | 2:31 AM

రక్తదానం.. కర్తవ్యం

20-02-2025 12:00 AM

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బుధవారం చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదానం చేశారు. ఇలా ఆయన రక్తదానం చేయటం ఇది రెండోసారి. ఈ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ ‘చిరంజీవి సినిమాలకు సంగీతాన్ని అందించి ఆయనపై అభిమానాన్ని చాటుకున్నా. ఇప్పుడు రక్తదానం చేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నా. లక్షలాది మంది ఇందులో భాగమయ్యారు. అందులో నేనూ ఒక బొట్టులా చేరడం ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమంలో అందరూ భాగం కావాలి’ అన్నారు.