calender_icon.png 21 February, 2026 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఎస్‌ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

20-02-2026 12:00:00 AM

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 19(విజయక్రాంతి): తలసేమియా బాధిత చిన్నారులను ఆదుకునే ఉద్దేశంతో ఎన్‌ఎస్‌ఎస్ ఫౌండేషన్ వరంగల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించబ డింది. ఛత్రపతి శివాజీ జయంతి, దెంచనాల కివాన్ జన్మదినం సందర్భంగా గురువారం హనుమకొండ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో ఈ రక్తదాన శిబిరాన్ని ఎన్‌ఎస్‌ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అ ధ్యక్షుడు నరేంద్ర నాగవెళ్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి అతిథులుగా రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, న్యాయవాది వద్దిరాజు గణేష్ లు పాల్గొని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనం తరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రక్తదానం ద్వారా తలసేమియా బాధితులకు పునర్జన్మను అందించవచ్చని తెలిపారు.

తలసేమియా చిన్నారులకు నిరంతరం రక్తం అవసరమని, వేసవి కాలంలో రక్తం కొరత లేకుండా, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి తలసేమియా బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.  దాదాపు 40 మంది రక్తదాన రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ రెడ్ క్రాస్ జిల్లా కో శాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, బిళ్ళ రమణారెడ్డి, విశ్రాంత ఇంజనీర్ సత్యనారాయణ రావు, ఎన్‌ఎస్‌ఎస్ ఫౌండేషన్ చైర్మన్ నాగవెళ్లి సరిత నరేంద్ర, ప్రధాన కార్యదర్శి అనిశెట్టి వెంకటేష్, ఉపాధ్యక్షుడు కందికొండ వెంకటేష్, డైరెక్టర్ సవరం రంజిత, సభ్యులు మునిగంటి అమరేంద్ర చారి, అజయ్, రూపేష్, సురేష్, సందీప్, రాజేందర్, రవి నాయక్, రాజేష్ నాయక్ తదితరులు, రెడ్ క్రాస్ సిబ్బంది, రక్తదాతలు పాల్గొన్నారు.