20-02-2026 12:00:00 AM
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేటలో గోటి తాళంబ్రాల కార్యక్రమం శ్రీ రామదాసు సేవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించి పదకొండు రోజులు పూర్తయ్యాయని జిల్లా బాద్యులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా భద్రాచలం పుణ్యక్షేత్రంలో నిర్వహించే సీతారాముల కల్యాణనికి సేవాసమితి ఆధ్వర్యంలో గోటి తాళంబ్రాలు పంపించడం జరుగుతోందని, ఈ ఏడాది కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నామని చెప్పారు.
జయశంకర్ భూపాలపల్లి తో పాటు హన్మకొండ, ములుగు జిల్లాల నుండి కూడా సేవా సమితి ద్వారా ఈ ఏడాది భారీగా గోటి తాళంబ్రాలను పంపించడానికి కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. శ్రీ రామదాసు సేవా సమితి, శ్రీ రామదాసు భజన మండలి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి రోజు భక్తి శ్రద్దలతో అందరూ ఒక్కచోట చేరి సమిష్టిగా గోటి తలంబ్రాలు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అరెందుల లలిత, సేవా సమితి అధ్యక్షులు బెనికి రాజేందర్, ఉపాధ్యక్షులు పనికెలా శివకృష్ణ, భజన మండలి అధ్యక్షులు ఆకుల దామోదర్, ఉపాధ్యక్షులు దూలం శంకర్, మహిళా సేవా సమితి అధ్యక్షులు పనికేలా వసంత, ఉపాధ్యక్షులు జీడీ స్వర్ణలత, సభ్యులు గందే శ్రీనివాస్, సింగం రాజవీరు, పాలకుర్తి సాంబయ్య, రౌతు ఓదెలు, గందే పద్మ, తిప్పని వినోద తదితరులు పాల్గొన్నారు.