యువ 24 ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం
04-04-2026 12:00 AM
కొడంగల్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి ): అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు యువ 24 ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త దానం చేయడం జరుగుతుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. శుక్రవారం తాండూర్ పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బిచ్చల గ్రామానికి చెందిన కోళ్ల అరుణ అనే మహిళ కు రక్తం అత్యవసరం కావడంతో యువ 24 ఫౌండేషన్ ను సంప్రదించడతో వెంటనే ఫౌండేషన్ తరపున రక్తదాతను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.అత్యవసర పరిస్థితి లో ఉన్న మహిళకు టెంట్ హౌస్ ప్రకాష్ రక్త దానం చేసి మానవత్వం చాటుకున్నారని తెలిపారు. యువ 24 ఫౌండేషన్‌కు మరియు రక్త దాత ప్రకాష్ కు రోగి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినారు.




