డీసీసీని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కమిటీ నూతన నాయకులు
ఘట్ కేసర్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన ఉపాధ్యక్షులుగా వేముల మహేష్ గౌడ్ నియమితులైన సందర్బంగా శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ని అలాగే మేడ్చల్ మాజీ శాసనసభ్యులు మలి పెద్ది సుధీర్ రెడ్డిని, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
కార్యక్రమాలలో మహేష్ గౌడ్ తో పాటు నూతనంగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన ఇటిక్యాల కృష్ణరెడ్డి, ఏనుగు జిలేందర్ రెడ్డి, కార్యదర్శి గా నియమితులైన ఉదండపురం సత్యనారాయణ, జిల్లా ఆర్టిఏ సభ్యులు భీమిడి జైపాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి, తుంగతుర్తి రవి, బొమ్మకు శ్రీనివాస్, శివశంకర్, సంతోష్ గౌడ్,రామస్వామి ముదిరాజ్, మేడ్చల్ నియోజకవర్గం ఎస్టి సెల్ అధ్యక్షులు ననావత్ సురేష్ నాయక్, నాయకులు బత్తుల రాజుగౌడ్, బద్రి హేమంత్ కుమార్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




