15 July, 2026 | 12:00 AM

అబాకస్ పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేతలుగా బ్లూ బెల్స్ విద్యార్థులు

15-07-2026 12:00 AM

ముకరంపుర, జూలై 14 (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని హనుమాన్నగర్లో ఉన్న బ్లూ బెల్స్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. 2026 జూలై 12న హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి లెవల్3 SIP అబాకస్ పోటీల్లో 6వ తరగతి విద్యార్థిని కె. విహారి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి అపూర్వ విజయాన్ని అందుకుంది.

ఈ పోటీల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొనగా, వినూత్న అద్భుత ప్రతిభ కనబరిచి ఈ ఘనతను సాధించింది.అదే విధంగా, 8వ తరగతి విద్యార్థి కె. వినూత్న కూడా తెలంగా ణ రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో తృతీయ స్థానం సాధించి పాఠశాల ప్రతిష్ఠను మరింత పెంచాడు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జంగా సునీత మనోహర్ రెడ్డి విజేతలను ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధిం చాలని ఆకాంక్షించారు.