కాంగ్రెస్ లో చేరిన బొడశట్ పల్లి గ్రామ సర్పంచ్
మునిపల్లి ఆగస్టు 3 (విజయక్రాంతి): మండలంలోని బొడశట్ పల్లి గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ పొట్టిగారి మల్లేశ్వరి ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Raja Narasimha) సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా సర్పంచ్ తోపాటు వార్డులు, సుమారు 50మంది బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో వారికి మంత్రి దామోదర రాజనర్సింహ్మ పార్టీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ్మ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం లో గ్రామాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గ్రామాలలో మహిళా సాధికారత, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు, మంచినీటి సరఫరా, ఉపాధి అవకాశాల పెంపుకు కృషి చేస్తున్నామని మంత్రి దామోదర్ నరసింహ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో గ్రామ సర్పంచ్ మల్లేశ్వరి, వార్డు సభ్యులు అనంత శ్యామమ్మ, అనంతలక్ష్మి, శ్రీకాంత్ తోపాటు తన అనుచరులు చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులుపాల్గొన్నారు.






