3 August, 2026 | 10:11 AM

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు

03-08-2026 09:37 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు 03: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని లోయపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. లోయపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు మంచాల చిన్న లక్ష్మీనర్సయ్య రోజు మాదిరిగానే కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడడంతో అతని రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు.వెంటనే అతనిని సర్పంచ్ వల్లపు గంగయ్య,గ్రామస్తులు 108 అంబులెన్సులో జిల్లా కేంద్రం సూర్యాపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.