ప్రారంభించిన పోలీస్ అవుట్‌పోస్ట్

04-10-2026 | 09:59pm

ఎన్నిరోజులు కొనసాగుతుందో వేచి చూడాలి!

బోధన్, అక్టోబర్ 04 (విజయ క్రాంతి) : బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో(Bodhan Government Hospital) ప్రజల సౌకర్యార్థం పోలీస్ అవుట్‌పోస్ట్‌ను(Police Outpost) ప్రారంభించడం అభినందనీయమే. ACP బోధన్ శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ అవుట్‌పోస్ట్ 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు.

అయితే ఈ పోలీస్ అవుట్‌పోస్ట్ 24 గంటలు అందుబాటులో ఉంటుందా? లేక కొన్ని రోజులు మాత్రమే కొనసాగుతుందా? అనేది వేచి చూడాల్సిందే. గతంలో ప్రారంభించిన కొన్ని ఏర్పాట్లు కొద్దిరోజులకే కనుమరుగైన సందర్భాలు ఉండటంతో, ఈ అవుట్‌పోస్ట్ విషయంలోనూ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

ప్రారంభించడం ఒక ఎత్తు... నిరంతరం కొనసాగించడం మరో ఎత్తు. ప్రజలకు నిజంగా 24 గంటల పోలీస్ సేవలు అందుతాయా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

మరిన్ని వార్తలు