వినాయక విగ్రహాల నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన బోధన్ ఆర్డీఓ
11-09-2026 | 01:16pm
బోధన్, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): బోధన్ పట్టణం(Bodhan town)లోని పశువుల వాగు వద్ద ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహాల నిమజ్జన స్థలాన్ని ఆర్డీఓ ఎం. విజయకుమారి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ శుక్రవారం పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆర్డీఓ సూచించారు.
నిమజ్జన స్థలంలో తగినంత లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు క్రేన్లను అందుబాటులో ఉంచాలని, నీటిని నిల్వ చేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.