27 June, 2026 | 7:05 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

మూలవంక అడవుల్లో బయటపడ్డ మృతదేహాలు

16-09-2025 10:44 AM

హైదరాబాద్: తిరుపతి జిల్లా పాకాల మండలం మూలవంక అడవుల్లో(Moolavanka forests) మృతదేహాలు బయటపడ్డాయి. పక్కనున్న గోతుల్లో మరో ఇద్దరి చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. మహిళ, పురుషుడి మృతదేహాలకు పోలీసులు శవపరీక్షలు చేయించారు. మహిళ, పురుషుడిని హత్య చేసినట్లు శవపరీక్షల్లో వైద్యులు నిర్ధారించారు. నోటిలో గుడ్డలు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు తమిళనాడు తంజావూరు కు చెందిన కలై సెల్వన్ గా గుర్తించారు. మృతురాలు తన భార్య అంటూ భర్త వెంకటేష్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య, పిల్లలు కూడా కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తి కోసం జరిగిన హత్యా.. పరువు హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాకాల పోలీసులు ఘటనాస్థలంలో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.