27 June, 2026 | 8:04 PM

అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు

27-06-2026 06:57 PM

బోథ్,(విజయక్రాంతి): ఆర్థికంగా వెనుకబడిన కులాల వారి కోసం ఏర్పాటుచేసిన సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రంలో ఓ మారుమూలన ఉన్న ఈ హాస్టల్ ను చూసిన విద్యార్థులు అందులో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది హాస్టల్లో కేవలం 25 మంది విద్యార్థులు నివాసం ఉండగా ఈ ఏడాది అయితే హాస్టల్ ను చూసి విద్యార్థులు వెనుదిరిగిపోతున్నారు.

మరుగుదొడ్లు అసౌకర్యంగా ఉండడంతో..... 

విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన మరుగుదొడ్లు అసౌకర్యంగా ఉండడంతో విద్యార్థులు గత ఏడాది ఇబ్బందులకు గురయ్యారు. విరిగిపోయిన తలుపులతో అసౌకర్యంగా ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. అయితే హాస్టల్ పరిసరాలు పాములకు నిలయంగా మారాయని విద్యార్థులు అంటున్నారు. మరోవైపు బీసీ హాస్టల్ పరిసరాల్లో పిచ్చి మొక్కలు ఉండడంతో పాములు సంచరిస్తున్నాయని భయపడుతున్నారు.

మరమ్మత్తులు చేపట్టాలి

హాస్టల్ లో ఫ్రీ అయిన వసతుల కల్పన కోసం మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల తాలూకా స్థాయి అధికారులు హాస్టల్లో పరిశీలించి వెళ్లడం జరిగిందని హాస్టల్ వార్డెన్ శ్రవణ్ రెడ్డి తెలిపారు. వసతులు కల్పనక ఈ గతంలోని ప్రతిపాదన పంపామన్నారు