గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
జవహర్ నగర్,(విజయక్రాంతి): గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం దమ్మాయిగూడలోని పద్మశాలి టౌన్షిప్ సమీపంలో గుర్తుతెలియని మగ వ్యక్తి పడి ఉన్నాడని ఈనెల 28న స్థానికులు 100కు డయల్ చేశారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడి కనిపించాడు. 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికీ మృతి చెందాడని తెలిపారు. మృతుడు గత కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. మృతుడు 40 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయసు ఉంటాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






