14 May, 2026 | 11:19 PM

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

29-04-2026 08:41 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  28న మధ్యాహ్నం సుమారు 3:00 గంటల సమయంలో చెంగిచర్ల క్రాస్ రోడ్స్ వద్ద ఏవీ ఇన్ఫో ఫ్రైడ్ సమీపంలోని ఓపెన్ గ్రౌండ్‌లో సుమారు 50-55 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు  సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతుడు సుమారు 5.5 అడుగుల ఎత్తు, తెలుపు రంగు చెక్స్ షర్ట్, బూడిద రంగు ప్యాంట్ ధరించి, గడ్డం ఉందని తెలిపారు.  ఎండ తీవ్రత (సన్ స్ట్రోక్) కారణంగా మరణించి ఉండవచ్చని,ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని,మృతుడి వివరాలు తెలిసిన వారు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ శంకరయ్య తెలిపారు.